Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూముల రీ సర్వేపై అవగాహన

భూముల రీ సర్వేపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని బట్లపల్లి గ్రామంలో శుక్రవారం తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ బట్లపల్లి రెవెన్యూ గ్రామంలో తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం,1923 లోని సెక్షన్ – 6(1) కింద భూ పునః సర్వే చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయబడిందన్నారు.భూ పునః సర్వే ప్రక్రియ కేవలం గ్రౌండ్ ట్రూతింగ్ విధానం ద్వారా మాత్రమే పూర్తి చేయబడుతుందని వివరించారు.రీ-సర్వే సమయంలో భూ యజమానులు తమ భూమి వద్ద స్వయంగా హాజరై,తగిన రెవెన్యూ పత్రాలు,సరిహద్దులను స్పష్టంగా చూపిస్తూ నిర్ణయించుకోవాల్సింది అన్నారు.దానికి పూర్తి బాధ్యత సదరు రైతులదేనని అన్నారు.

రీ-సర్వే లో మొదటి దపాలో బట్లపల్లి గ్రామ సరిహద్దులను నిర్ధారించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ గ్రామంలోని ప్రభుత్వ భూములు,గైరాన్ భూములు,ఇనాం భూములు,వక్స్డ్,దేవాలయ భూములు,అటవీ భూములు,చెరువులు,కుంటలు,వాగులు,రోడ్లు మరియు ఇతర భూములన్నింటినీ ల్యాండ్ పార్సల్స్ వారీగా సర్వే చేయడం జరుగుతుందని,దీనికి గ్రామ ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరారు.సర్వేపై అభ్యంతరాలు ఉంటే, సెక్షన్ – 9(2) ప్రకారం నోటీసులు జారీ చేసి,సదరు అభ్యంతరాల పరిష్కారం అనంతరం రైతులకు (భూధార్ సంఖ్య) కేటాయించబడుతుందని వివరించారు.గ్రౌండ్ ట్రూతింగ్ ఆధారంగా తయారు చేసిన ల్యాండ్  పార్సెల్ మ్యాప్ పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో, సెక్షన్ 9(2) ద్వారా 60 రోజుల లోపు వాటిని పరిశీలించి తగిన పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిసి మున్నయ్య గ్రామ సర్పంచ్ శిరసనవాడ బిక్షమయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -