Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుండే "పది" పరీక్షలు

రేపటి నుండే “పది” పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
రేపటి నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంగతుర్తిలో 189 మంది విద్యార్థులు, మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు 172 మంది విద్యార్థులు,సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల యందు 190 మంది విద్యార్థులు, మూడు కేంద్రాలలో కలిపి 551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో సీఎస్ గా భాస్కర్, డిఓగా వెంకటి, మేరీ మదర్ పాఠశాల యందు సిఎస్ గా అశోక్, డిఓ గా కిష్టయ్య, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల యందు సిఎస్ గా శ్రీనివాస్, డిఓ గా యాకయ్య లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 35 మంది ఇన్విజిలేటర్లతోపాటు ముగ్గురు సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు అవసరమైన ఫర్నిచర్ తో పాటు వైద్య సేవలను అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 9:35 దాటితే పరీక్షా కేంద్రానికి అనుమతించరని తెలిపారు. ఒత్తిడికి లోను కాకుండా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -