- Advertisement -
కొయ్యుర్ ఎస్-2 రాజన్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
సైబర్ నేరాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ సూచించారు. గురువారం మండలంలోని కొయ్యుర్, మల్లారం, తాడిచెర్ల గ్రామాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ప్రధాన సెంటర్లలో కరపత్రాలు పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరగడం ద్వారా సైబర్ నేరగాళ్లు తప్పుడు లింకులు పంపి మనకు తెలియకుండానే డబ్బులు కాజేయడం జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత గ్రామాల్లో మత్తు పదార్దాలకు అలవాటు పడి జీవితాలను నాశకం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



