మీడియాతో మాట్లాడిన తీరు హాస్యాస్పదం
ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ఆరోపణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అవకాశవాదని, ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో చట్టాలు చేస్తారు, ఆ చట్టాలను అమలు పరచాల్సిన బాధ్యత అధికారులదని, అమలు పరిచేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదని ఈ మాత్రం మాజీ ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును పంచాయతీలు కౌన్సెలింగ్ ఇవ్వాలనడం సరికాదని, పంచాయితీలు చేయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం పుట్టకు కొత్తేమి కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలు, హత్యలు చేయించి, పదవి పోయే సరికి మతిస్థిమితం కొల్పయి మాట్లాడుతున్నట్లుగా ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య గల వ్యక్తిగత అంశాన్ని రాజకీయాలకు చుట్టడమే కాకుండా శ్రీధర్ బాబు, శ్రీను బాబు, పోలీసుల పైన నిరాధార ఆరోపణ చేయడం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకేని తెలిపారు. పుట్ట వ్యాఖ్యలు అశాంతిని రగిల్చేలా ఉన్నాయని, ఈ అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.



