- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన అయిత సర్వారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



