- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
99 రోజుల ప్రజా ప్రణాళిక ప్రగతి పాలన లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణమంతా కలియతిరిగి చూసి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణలో చూసి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
- Advertisement -



