Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొసైటీ ఎఫ్పిఓలో రైతులు సభ్యులుగా చేరండి

సొసైటీ ఎఫ్పిఓలో రైతులు సభ్యులుగా చేరండి

- Advertisement -

రైతు వేదిక అవగాహన సదస్సులో జిల్లా డిసిఓ రామ్మోహన్
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ సొసైటీ ఎఫ్పిఓలో రైతులు సభ్యులుగా చేరండి నేటి సభ్యులు రాబోయే రోజుల్లో ఓనర్లుగా తయారవుతారని కామారెడ్డి జిల్లా డిసిఓ రామ్మోహన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్నూర్ సొసైటీ ద్వారా ఎఫ్ పి ఓ రైతు సంఘం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఎఫ్ పి ఓ గురించి రైతులకు అవగాహన సదస్సును మద్దూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో డిసీఓ రామ్మోహన్, ఎంపీడీవో రాణి మండల ఏవో రాజు మద్నూర్ సొసైటీ పర్సన్ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ మానిటర్ ఆఫీసర్ అబ్దుల్ హలీం ఎక్స్పెక్టర్ శివాని గుప్తా ఉప సర్పంచ్ రమేష్ మద్నూర్ సొసైటీ సెక్రెటరీ గంగాధర్ డోంగ్లి సొసైటీ సెక్రటరీ బాబురావు తదితరులంతా ఈ సదస్సులో పాల్గొన్నారు.

సొసైటీ ద్వారా ఏర్పడిన ఎఫ్పిఓ గురించి ఏ విధమైన లాభాలు, అవకాశాలు లభిస్తాయనే విషయాల గురించి స్పష్టంగా తెలిపారు. ఎఫ్పివో లో రైతులు సభ్యులుగా చేరి ప్రభుత్వ పరంగా అందే ఎరువులు విత్తనాలు సబ్సిడీ పరికరాలు మద్దతు ధర కొనుగోలు ప్రతి ఒక్కటి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎఫ్పిఓ లో ప్రభుత్వ అధికారులు ఉంటారని ప్రవేట్ పరంగా ఎఫ్పిఓ లు ఉన్నప్పటికీ సొసైటీ ప్రభుత్వ పరంగా ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ పరంగా ప్రభుత్వపరంగా ఏర్పడిన ఎఫ్ పి ఓ కు సొసైటీ ఎఫ్ పి ఓ ల ద్వారానే ముందుగా అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సభ్యులుగా చేరాలని అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన సదస్సులోనే కొంతమంది రైతులు ఎఫ్ పి ఓ లో సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ అవగాహన సదస్సు రైతులకు ఎంతో ఉపయోగ పడింది ఈ సదస్సులో వ్యవసాయ రైతులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -