Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 16న మండల స్థాయి ఉపాధి హామీ ప్రజావేదిక: ఎంపీడీవో

ఈనెల 16న మండల స్థాయి ఉపాధి హామీ ప్రజావేదిక: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16న ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాలలో 2026 ఫిబ్రవరి 27 నుండి 2026 మార్చ్ 15 వరకు సామాజిక తనిఖీ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మండల స్థాయి ప్రజావేదిక ఈనెల 16న ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమానికి సమస్త ఉపాధి సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, పోస్టల్ సిబ్బంది, సంబంధిత అధికారులు, ఉపాధి కూలీలు హాజరవుతారని చెప్పారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమానికి విలేకరులు కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -