- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రేపటి నుండి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థినిలకు మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉషా సంతోష్ మాట్లాడుతూ.. పది పరీక్షల్లో విద్యార్థినీలు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల్లో మద్నూర్ మండల విద్యార్థినీలు ప్రథమ స్థానంగా నిలవాలని కోరారు. అనంతరం సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ దంపతులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



