నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక అభిషేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నగేష్ రెడ్డి, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఉమామహేశ్వర ఆలయంలో టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



