నవతెలంగాణ-హైదరాబాద్: మరోమారు పార్లమెంట్ మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ, విద్యార్థుల నిరసనలకు సంఘీభావంగా ప్రతిపక్షాలు ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. ఉభయసభల్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని, విద్యాశాఖ మంత్రి పదవీకి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా దేశ యువతకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
“యువతకు మూడు డిమాండ్లు ఉన్నాయి, వాటిని తప్పక నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి, నరేంద్ర మోడీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి,” అని కాంగ్రెస్ పోస్ట్ చేసింది.


