- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రధాని మోడీ స్పందించారు. “కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారతదేశాన్ని రక్షించడంలో మన వీర సైనికులు చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు, అంకితభావానికి దేశం యావత్తూ కృతజ్ఞతలు తెలుపుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు ప్రదర్శించిన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణం. వారి అచంచలమైన దేశభక్తి, కర్తవ్యనిష్ఠ భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
- Advertisement -



