Sunday, July 26, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులకు మద్దతుగా శివసేన భారీ ర్యాలీ

విద్యార్థులకు మద్దతుగా శివసేన భారీ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్-యూజీ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఆదివారం భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లతో పాటు భారీగా పోలీసు సిబ్బంది మోహరించారు. జెన్ జీ భారీ ఆందోళనలతో శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం యువత శక్తిని ప్రదర్శించడానికే శివసేన (యూబీటీ) అధినేత ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -