రూ.2,278.14 కోట్లతో
2,009.23 ఎకరాల్లో ఏర్పాటు :
ఆర్అండ్బీ శాఖ మంత్రి
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్‌గా మారనున్న ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు రాష్ర్ట ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2,278.14 కోట్లతో నిర్మించనున్న ఎయిర్‌ఫీల్డ్‌కు అవసరమైన 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్, ఎంఆర్ఓ కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్టు తెలిపారు. రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా పరిపాలనా అనుమతిలో భాగంగా కేటాయించినట్టు తెలిపారు. భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్టు వెంకటరెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -



