నవతెలంగాణ-హైదరాబాద్: జెన్ జీ ఆందోళనల నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ సవరణల ద్వారా పేపర్ లీక్‌ల వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రతిపాదిత సవరణ బిల్లు ప్రకారం, ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల పారదర్శకతను కాపాడడం, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లులోని ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
జెన్ జీ ఆందోళనలు.. పార్లమెంట్ లో కీలక బిల్లు
- Advertisement -
- Advertisement -



