Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లు..సాయంత్రం 5 గంట‌ల‌కు చ‌ర్చ

ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లు..సాయంత్రం 5 గంట‌ల‌కు చ‌ర్చ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లును ఇవాళ లోక్‌స‌భ‌(Lok Sabha)లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. మంత్రి జితేంద్ర సింగ్ ఆ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు లోక్‌స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే స‌భ‌ను వాయిదా వేస్తూ.. స్పీక‌ర్ ఓం బిర్లా సాయంత్రం 5 గంట‌ల‌కు పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లుపై చ‌ర్చ చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప‌బ్లిక్ ఎగ్జామ్స్ స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌కారం పేప‌ర్ లీకేజీ కేసుల‌ను రెండు నెల‌ల్లోగా ద‌ర్యాప్తు చేప‌ట్టాలి. పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డిన వారికి క‌నీసం 5 నుంచి ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డ‌నున్న‌ది. జ‌రిమానా సుమారు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు విధించ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -