నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళలతో కేంద్ర విద్యాశాఖమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసింందే.సోమవారం తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేసి చేసింది సీజేపీ. పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్ని రేపటిలోగా ఎత్తివేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. కాగా, నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న యువతపై ఢిల్లీ పోలీసులు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. జూలై 20న, జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు సాగిన “సంసద్ చలో” ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొన్నారు. శాంతియుతంగా సాగుతున్న యువత ర్యాలీపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేయడంతో వందల సంఖ్యలో యువత గాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి ‘కాక్రోచ్` హెచ్చరిక
- Advertisement -
- Advertisement -



