- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న విద్యార్థి సంఘాలు నిర్వహించిన బీహార్ బంద్ లో పలు ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీస్ శాఖపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు సదురు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
- Advertisement -


