- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని.. రంగనాథ్‌ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.



