Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంమహాత్మా గాంధీకి వాంగ్ చుగ్ నివాళి

మహాత్మా గాంధీకి వాంగ్ చుగ్ నివాళి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‎చుక్ ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రి నుంచి  డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేశారు.

కాగా, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ ధర్నాకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 23 రోజుల పాటు దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించారు. క్రమంలో సీజేపీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో 26 రోజుల తర్వాత వాంగ్ చుక్ తన దీక్ష విరమించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -