- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో విల్లుపురం సమీపంలోని ఫ్లైఓవర్‌పై మంగళవారం ఉదయం జరిగిన వాహనాల ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి జారిపడి, ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టింది. వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ కారు బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విల్లుపురం నివాసి అయిన భూపతి అక్కడికక్కడే మరణించగా, కారులో ప్రయాణిస్తున్న జాన్ అన్బళగన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -



