Tuesday, July 28, 2026
E-PAPER
Homeఆటలుటీ20 ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య పెంపు

టీ20 ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో జట్ల సంఖ్యను 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 2032 ఎడిషన్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచుల సంఖ్య, ప్రసార హక్కులు, సరైన వేదికలను నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలుగా మారనుంది. దశలవారీగా ఈ విస్తరణను చేపట్టి మొదట 24 జట్లతో ఆడి, వచ్చే ఫలితాలను బట్టి 32 జట్లకు పెంచనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -