Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. అయోధ్య రామమందిర్ ఆలయంలో విరాళాల చోరీని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆలయ నిధుల విషయంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. “చడావా చోర్, గద్దీ చోర్” అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంగళవారం నాడు ఈ అంశాన్ని లేవనెత్తడానికి సమాజ్‌వాదీ పార్టీ (SP) సిద్ధమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రామాలయ నిర్మాణానికి మద్దతుగా లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రను ప్రారంభించిన 1990 నుండే ఇలాంటి దొంగతనాల ఘటనలు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన గణాంకాలు కేవలం 45 నుండి 50 రోజుల కాలానికి సంబంధించినవి మాత్రమేనని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -