- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:45 గంటలకు ఇరాన్ భూభాగం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు CENTCOM వెల్లడించింది.
- Advertisement -



