Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట

ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి ఊరట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐషీఘోష్‌కి వ్యతిరేకంగా జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్‌పై ఢిల్లీ కోర్టు బుధవారం స్టే విధించింది. గత విచారణ తేదీన అనివార్య కారణాల రిత్యా హాజరుకాలేకపోయానని ఘోష్‌ తరపు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. దీంతో అరెస్ట్‌ వారెంట్‌పైప పాటియాలా హౌస్ కోర్టులోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ స్టే విధించారు. తదుపరి విచారణ తేదీ వరకు వారెంట్‌ను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జంతర్‌ మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతలపై కేంద్రం ప్రతీకార చర్యలకు దిగుతోంది. పాత కేసుల్లో వారిని అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తోంది. 2021నాటి కేసులో మంగళవారం ఐషీఘోష్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు యత్నించిన సంగతి తెలిసిందే. జాన్‌ బ్రిట్టాస్‌ సహా పలువురు పార్టీ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు వెనుదిరిగారు.

2021లో ‘బంగ్లా భవన్’ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించి ఈ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం (ఐపిసి సెక్షన్ 188), నేరపూరిత అతిక్రమణ (సెక్షన్ 447) వంటి నేరాలకు గాను ఐషీ ఘోష్‌పై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఆమెపై ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -