- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ నేత, పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు న్యాయపోరాటానికి దిగారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు (క్వాష్) చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూ సాకుతో ఫ్లాట్‌కు పిలిపించి, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను వేధించారంటూ ఈ నెల 26న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా… ఈ వ్యవహారంపై రేగా కాంతారావు ఘాటుగా స్పందించారు.
- Advertisement -



