నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అజింక్య రహానెపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. జెర్సీ నంబర్ 278కి వీడ్కోలు పలుకుతూ రహానె సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సచిన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “మనం తొలిసారి ముంబయి జట్టు తరఫున కలిసి బ్యాటింగ్ చేసినప్పుడే… అవకాశాల కోసం ఎన్నడూ వెంటపడని ఒక ప్రత్యేకమైన ఆటగాడిని నీలో చూశాను. జట్టు విజయం కోసం కష్టపడేందుకు నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడివి, అందుకే అవకాశాలే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవి. నీకున్న ఆ గొప్ప లక్షణమే ఆస్ట్రేలియా గడ్డపై నీ కెరీర్లోనే మరచిపోలేని అత్యుత్తమ విజయ క్షణాలను అందించింది. సంయమనంతో ఆడటం అనేది దూకుడుకు ఎప్పుడూ అడ్డుకాదని నువ్వు నిరూపించావు. వండర్ఫుల్ కెరీర్ రహానె, కంగ్రాచులేషన్స్!” అని సచిన్ కొనియాడారు.
రహానే రిటైర్ మెంట్ పై సచిన్ భావోద్వేగ పోస్ట్
- Advertisement -
- Advertisement -



