Friday, July 31, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్ ఎదుట విపక్షాల వినూత్న నిరసన

పార్లమెంట్ ఎదుట విపక్షాల వినూత్న నిరసన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రామమందిరంలో విరాళాల అపహరణపై సభలో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ ఎన్డీయే సర్కార్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఆర్జేడీ పార్టీ ఎంపీ పప్పు యాదవ్.. కాషాయ వస్త్రాలు ధరించి ఓ టేబుల్ వేసి దానిపై హుండి పెట్టారు. ఆ టేబుల్‌కు అటు ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. పప్పు యాదవ్ పక్కన ఓ మహిళా ఎంపీ కూడా కూర్చొని ఉన్నారు. వారికి చుట్టూ చాలా మంది రౌండ్‌గా నిలబడి ఉన్నారు. అంతలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. పప్పు యాదవ్ వద్దకు వచ్చి నమస్కరించి.. ఆ హుండిలో నగదు వేశారు. ఆ తర్వాత పలువురు ఎంపీలు.. ఆ హుండీలో నగదు వేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -