Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎంపిఓ రాముతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు కాలయాపన చేయకుండా నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణాలను ప్రారంభించిన వారికి విడతల వారీగా వారి ఖాతాలలో నగదు జమచేయడం జరుగుతుందన్నారు. లబ్దిదారులకు ఈ విషయమై ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన కార్యాలయానికి వచ్చి విన్నవించుకోవచ్చని, వీలైనంతవరకు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -