నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో మంగళవారం మహాజన సభ సమావేశం అఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ టి. సురేష్ కుమార్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి బి. మోహన్ గౌడ్ గారు 01-10-2025 నుండి 23-03-2026 వరకు అర్ధవార్షిక కాలానికి సంబంధించిన జమా-ఖర్చు వివరాలను ప్రవేశపెట్టారు.
రైతుల సమస్యలపై చర్చించి పలు ముఖ్య తీర్మానాలు చేశారు. యూరియాను మండలాల వారీగా కాకుండా సంఘం గ్రామ పరిధిలోనే సరఫరా చేయాలని, సభ్యుల రుణాలను ఒకేసారి రుణమాఫీ చేయాలని, వరి పంటతో పాటు ఆరుతడి పంటలపై అవగాహన కోసం రైతు వేదికలో సదస్సులు నిర్వహించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బాలగౌని రాజాగౌడ్, సర్పంచ్ సాయ గౌడ్, సంఘ డైరెక్టర్లు, సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



