Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో నేడు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు భారీ వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి బికనేర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. అదే సమయంలో, ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న మరొక ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -