- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేర్పించారు. డాక్టర్ అనూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ప్రస్తుతం తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



