Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: కొండమడుగు నరసింహ

బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: కొండమడుగు నరసింహ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : బ్రిడ్జి నిర్మాణం చేయకుండా పైపులను తొలగిస్తే గ్రామ ప్రజలందరూ కలిసి కాలువను  పూడ్చడానికి కూడా వెనకాడం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో  నాయకులు వ్యవసాయ కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం చేపట్టినంక మరొక మాట మాట్లాడకుండా ప్రజా ప్రతినిధులు వ్యహరించాలనారు.  ప్రజలను ఇబ్బందుల పాలు చేసే పనులను చేపడితే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. 

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకొని కాల్వపైన బ్రిడ్జి నిర్మాణము చేపట్టాలని, భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని కాలువ దగ్గర సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామ ప్రజలు, గ్రామ ప్రజా ప్రతినిధులు నిరసన తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, మాజీ సర్పంచ్ మాకొల్ల సత్యం, ఉప సర్పంచ్ అందె మల్లేశం, వార్డు మెంబర్లు జక్కుల మల్లేశం, కొండమడుగు అశోక్, గజ్జి కవితా కుమార్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండా అశోక్, సిపిఎం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు గోదాల వెంకటరెడ్డి, శెట్టి ఐలయ్య, కొండ పాండు, ఎంకర్ల పాండు, వీరేశం, రాజు, నరేష్, కొండమడుగు పోశయ్య, జహంగీర్, ఎడ్ల కిష్టయ్య, ఏశమైన నరసమ్మ, కూకుట్ల మల్లమ్మ, ఎడ్ల సరూప, కర్రే లక్ష్మి, కొండ మహేశ్వరి, నవ్య, రాగుల లక్ష్మి, పసుల కావ్య, ఏశమైన మంజులలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -