- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారుల జాబితాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, రేషన్ కార్డుల ముద్రణ, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాల అనంతరం నివేదికలు సమర్పించాలని సూచించారు.
- Advertisement -



