Thursday, August 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎలుగుబంటి దాడి.. అన్నాచెల్లెళ్లు మృతి

ఎలుగుబంటి దాడి.. అన్నాచెల్లెళ్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో నిన్న (బుధవారం) ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడ ఎలుగుబంటి తన పిల్ల చనిపోయిన ఆవేదనతో ఇద్దరు అన్నాచెల్లెళ్లపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం, ఎలుగుబంటి పిల్ల మంగళవారం నాడు చనిపోవడంతో తల్లి ఎలుగుబంటి ఆగ్రహంతో వ్యవహరించిందని తెలుస్తోంది. అధికారులు ఎలుగుబంటిని మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -