- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌తో చికిత్స పొందుతూ మరణించారు. రస్దా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి ఏకైక ప్రతినిధి. ఆయన మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు. ఉమాశంకర్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని స్టూడెంట్ లీడర్‌గా ప్రారంభించారు.
- Advertisement -



