- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో నాలుగు భూకంపాలు నమోదయ్యాయి. జాతీయ భూకంప పరిశోధన కేంద్రం ప్రకారం గురువారం ఉదయం 5:45 గంటలకు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, రెండు గంటల తర్వాత 7:17 గంటలకు అదే జిల్లాలో 3.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. అంతకుముందు బుధవారం 3.6, 5.4 తీవ్రతలతో మరో రెండు భూకంపాలు సంభవించాయి. ఇదే సమయంలో అసోంలోని నాగావ్ జిల్లాలో కూడా 3.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు.
- Advertisement -



