Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయండిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సహా కొన్ని డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007, ‘ఆదాయపు పన్ను చట్టం-2025, ‘ఆర్థిక చట్టం-2026’లలో సవరణలు చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టగా, ఎటువంటి చర్చ లేకుండానే వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది

లోక్‌సభ ఆమోదించిన సవరణ బిల్లు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయకుండా ఉన్న నిబంధనలో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

లోక్‌సభలో ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు. ప్రస్తుతం UPI వంటి డిజిటల్ చెల్లింపు విధానాలపై ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే ప్రతిపాదిత చట్ట సవరణలతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -