Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంనిర్మలా సీతారామన్‌కు జాన్ బ్రిట్టాస్ లేఖ

నిర్మలా సీతారామన్‌కు జాన్ బ్రిట్టాస్ లేఖ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పీసా గ్రామసభ మొబిలైజర్స్ ను తగ్గించడంపై రాజ్యసభ సీపీఐ(ఎం) పక్ష నాయకుడు జాన్ బ్రిట్టాస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పేసా (PESA) గ్రామసభ మొబిలైజర్‌ను నియమించే ప్రస్తుత విధానాన్ని మార్చి, ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు ఒక మొబిలైజర్ మాత్రమే ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయాన్ని అత్యవసరంగా పునఃపరిశీలించాలని ఆయన కోరారు.

మహారాష్ట్రలో మాత్రమే ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న 3,010 మంది పేసా మొబిలైజర్లలో మూడింట రెండొంతుల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని, దీనివల్ల గ్రామసభల పనితీరు బలహీనపడటమే కాకుండా వేలాది గిరిజన కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. గ్రామసభల నిర్వహణకు సహకరించడం, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కల్పించడం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తోడ్పడటం, అలాగే గిరిజన సమాజాల సామూహిక వనరులను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలను ఈ మొబిలైజర్లు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు.

ఈ నిర్ణయానికి ఆర్థిక కారణాలను ప్రశ్నిస్తూ, మహారాష్ట్రలోని మొత్తం 3,010 మంది మొబిలైజర్లను కొనసాగించేందుకు సంవత్సరానికి సుమారు ₹12 కోట్లు మాత్రమే అవసరమవుతాయని తెలిపారు. ఇది 2026–27 సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కోసం కేటాయించిన ₹1,142.31 కోట్ల బడ్జెట్‌లో కేవలం 1 శాతం మాత్రమేనని ఆయన గుర్తుచేశారు.

ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పేసా గ్రామసభ మొబిలైజర్‌ను కొనసాగించేందుకు అవసరమైన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని, గిరిజనుల స్వయం పాలనకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను వ్యయ నియంత్రణ (ఖర్చుల హేతుబద్ధీకరణ) పేరుతో త్యాగం చేయరాదని కామ్రేడ్ బ్రిట్టాస్ ఆర్థిక మంత్రిని గట్టిగా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -