- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఫుట్ బాల్ ఆటలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పడిం ఓ ఫుట్ బాల్ ప్లేయర్ చనిపోయారు. థాయ్ లాండ్ నరాతివాత్ ప్రావిన్స్‌లోని శాంటిపాప్ స్టేడియంలో బుధవారం ఉదయం ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల సోఫన్ అవేయ్ అనే ప్లేయర్ పై పిడుగుపడటంతో చనిపోయాడు. మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. అనుకోని ఈ సంఘటనతో ప్లేయర్లు, ప్రేక్షకులు షాక్ గురయ్యారు. ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -



