- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని మైలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బషోవ్వ అశోక్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు త్వరితగతిన పూర్తిచేసి గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపడితే విడతల వారీగా బిల్లులు వారి ఖాతాలలో జమచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో తో పాటు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ , జీపీ కార్యవర్గ సభ్యులు , కార్యదర్శి , గ్రామస్తులు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



