- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపరిదిలోగల శాత్రజ్ పల్లిలో తాడిచెర్ల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 52 మంది రోగులకు డెంగ్యూ, మలేరియా, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



