Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుమండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 15 మంది

మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 15 మంది

- Advertisement -
  • ఘనంగా సత్కరించి,ప్రశంస పత్రాలు అందజేసిన ఎంపిడిఓ

నవతెలంగాణ-మల్హర్ రావు: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 15 మందిని ఎంపిక చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జి. లక్ష్మణ్ బాబు తెలిపారు.ప్రభుత్వ,జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని కొయ్యూరు ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యదితిగా మండల ఎంపిడిఓ క్రాoతి కుమార్ హాజరరైయ్యారు.

వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన ఉపాధ్యాయుల పేర్లను ప్రకటించి వారికి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కారం చేసి,ప్రశంస పత్రాలను ఎంపిడిఓ అందజేశారు. ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్,పాఠ్య పుస్తకాలు,ఏకారుప దుస్తులు అందించడం జరుగుతుందని ఎంపిడిఓ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఎంపిడిఓ,ఎంఈఓ శుభాకాంక్షలు తెలిపారు.ఎంపికైన వారిలో ఎల్.రాజు నాయక్,పి.మానస, సిహెచ్. పూర్ణచందర్,జి. తిరుపతి, బి.రమేష్, కె.రాధిక,ఎం. నర్సయ్య,పి.సత్యనారాయణ, డి. చంద్రశేఖర్, జి. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, టి. మహిపాల్, పి. తిరుపతి రెడ్డి, బి. సాంబయ్య, ఎం. రమేష్ ఉన్నారు.

అలాగే, తాడిచెర్ల  వెల్మలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్. సురేష్, కె. గంగారాజులకు ప్రత్యేక సన్మానం చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెజిబివి ఎస్ఓ భవాని,మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -