- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎండీని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి: సత్తుపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎండీ టీకే శ్రీదేవిని కోరారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సీఎండీ టీకే శ్రీదేవిని, ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె. చౌట్‌లను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కలిశారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సీఎండీ శ్రీదేవితో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ చర్చించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు



