Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుఅమరచింత పీహెచ్ సిని సందర్శించిన  డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్

అమరచింత పీహెచ్ సిని సందర్శించిన  డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్

- Advertisement -

 నవతెలంగాణ-ఆత్మకూర్:  వనపర్తి జిల్లాలోని అమరచింత పట్టణంలోని డిఎంఆర్ హాస్పిటల్ ను పీహెచ్ సి గా అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిఎంహెచ్ ఓ) భాస్కర్ నాయక్  బుధవారం హాస్పిటల్ ను సందర్శించి పరిశీలించారు.గత ఆగస్టు 31న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో  డిఎంఆర్ హాస్పిటల్ ను పూర్తిస్థాయి పీహెచ్ సి గా గుర్తించి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తహసిల్దార్ రవికుమార్   డిఎంహెచ్ ఓతో ఫోన్ లో మాట్లాడగా, తాను బిజీగా ఉన్నానని, వీలు చూసుకుని త్వరలోనే వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నేడు ఆయన హాస్పిటల్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిఎస్. గోపి, సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్.అజయ్  డిఎంహెచ్ఓ తో మాట్లాడుతూ అమరచింత  డిఎంఆర్ హాస్పిటల్  పిహెచ్ సి గా అప్ గ్రేడ్ అయినందున 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా అమరచింతకు ఏడుగురు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున వారిని వెంటనే హాస్పిటల్ కు కేటాయించి విధుల్లో జాయిన్ అయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వీటిలోనూ 

డిఎంహెచ్ ఓ  భాస్కర్ నాయక్ స్పందించి మాట్లాడుతూ, అమరచింత హాస్పిటల్ పిహెచ్ సిగా ఎంపిక చేయబడిందని, దానికి తగిన డాక్టర్లు, సిబ్బందిని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి  కూడా ఈ సమస్యపై తనతో మాట్లాడారని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -