Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌ పేపర్ లీక్: విద్యార్థులతో ఆరో విడత చర్చలు

జార్ఖండ్‌ పేపర్ లీక్: విద్యార్థులతో ఆరో విడత చర్చలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నిరసన చేపడుతున్న విద్యార్థుల తరపున ప్రతినిధులతో ఆదివారం ఆరోవిడత చర్చలు చేపట్టేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి ఐదు విడతల చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులతో తాజా చర్చలు జరుపుతున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. చర్చలు విఫలం కావడంతో ఆందోళన చేపడుతున్న విద్యార్థులు జార్ఖండ్‌ ప్రభుత్వం “రాజకీయ కుట్రలు ” పన్నుతోందని జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి – సంస్కరణల మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనకారులైన విద్యార్థుల మధ్య విభజనలు సృష్టించడం, వారి ప్రధాన డిమాండ్ల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం ఈ చర్య వెనుక రాజకీయ ఎత్తుగడ అని ఆ సంస్థ మండిపడింది.

ఉద్యమాన్ని చీల్చేందుకు యత్నిస్తున్న ప్రభుత్వం

తమ ఉద్యమాన్ని చీల్చేందుకు హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యార్థి నేత రవీంద్ర పాశ్వాన్ ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 10న ‘విధానసభ ముట్టడి’ (ఘెరావ్) నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని అన్నారు. తమతో పాటు మరో 6-7 సంస్థల నుండి వినతిపత్రాలను స్వీకరించిందని అన్నారు. ప్రభుత్వం విభజనలు సృష్టించేందుకు ఈ విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్‌ఎస్‌యుఐ నుండి వినతిపత్రాలు ఎందుకు స్వీకరించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారి డిమాండ్లు తెలియదని, వారు నిరసనలో పాల్గొనలేదని అన్నారు. ప్రభుత్వం కుట్రలు పన్నుతూ.. ఈ ఉద్యమాన్ని 2-3 వర్గాలుగా చీల్చడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన ఆరోపించారు.

ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించిన విద్యార్థులు

రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి అభ్యర్థులు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం వైద్యుల బృందం నిరసనకారుల ఆరోగ్యాన్ని పరిశీలించింది. వారు ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించారని వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎపి సిన్హా తెలిపారు.

విద్యార్థులకు మద్దతుగా జెఎల్‌కెఎం నేత జైరామ్ మహతో ఒక రోజు నిరాహార దీక్ష

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి) , జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) నిర్వహించిన పరీక్షలలోని అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా, జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జెఎల్‌కెఎం) ఎమ్మెల్యే జైరామ్ మహతో ఆదివారం రాంచీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి అభ్యర్థుల నిరసన ప్రజా ఉద్యమంగా మారింది: జెడి(యు) ప్రతినిధి రాజీవ్ రంజన్

జార్ఖండ్‌లో పోటీ పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియపై విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ, రాంచీలో జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి అభ్యర్థులు చేస్తున్న నిరసన ఒక ప్రజా ఉద్యమంగా మారిందని జెడి(యు) జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ ఆదివారం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -