Sunday, August 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅరామ్‌కో శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి

అరామ్‌కో శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాలోని కీలక చమురు క్షేత్రంపై మరోసారి జరిగిన దాడి కలకలం రేపింది. సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. జజాన్ ప్రాంతంలోని అరామ్‌కో కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌదీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -