- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ సంతోష్ మృతిచెందాడు. మెకానిక్ బ్రేక్ చెక్ చేస్తుండగా డ్రైవర్ బస్సును ముందుకు నడిపినట్లు సమాచారం. దీంతో బస్సు మెకానిక్ పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



