Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంసీజన్-2కు సీజేపీ సన్నాహాలు

సీజన్-2కు సీజేపీ సన్నాహాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పోరుబాటకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదిగా సీజేపీ సీజన్-2 మొదలుకానుందని అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఈమేరకు బుధవారం జాతీయ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ‘లిజనింగ్ టూర్’ నిర్వహిస్తున్నామని. స్వాతంత్ర్య దినోత్సవం నుంచే విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. సీజేపీని కట్టడి చేయడానికి పలు కుట్రలు చేస్తున్నారని, తమ పార్టీ సమావేశం నిర్వహించుకోవడానికి హాల్ లభించకుండా ప్లాన్ చేస్తున్నారని బీజేపీ మీద పరోక్షంగా ఆరోపణలు చేశారు.

‘జంతర్-మంతర్’ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభమవుతుందని చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేస్తున్నారు. ‘జంతర్-మంతర్’ సీజన్ 2 చాలా త్వరలో ప్రారంభం కాబోతోందని నేను వారికి(బీజేపీ) చెప్పాలనుకుంటున్నాను.

“ఈ రోజు ఢిల్లీలో మా వాలంటీర్ల సమావేశం నిర్వహించాల్సి ఉంది. మేము ఒక హాల్ కోసం చూస్తున్నాము, కానీ ఎవరూ మాకు అద్దెకు ఇవ్వలేదు. పైనుంచి ఒత్తిడి ఉందని అందరూ చెబుతూనే ఉన్నారు,” అని దీప్కే అన్నారు. చివరికి పార్టీ ఒక హాల్‌ను సంపాదించగలిగిందని, అయితే సమావేశం రోజు ఉదయం దాని యజమానులకు బెదిరింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -