Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘పిల్ల..పిల్ల..’ సాంగ్‌ సూపర్‌ : సురేష్‌బాబు

‘పిల్ల..పిల్ల..’ సాంగ్‌ సూపర్‌ : సురేష్‌బాబు

- Advertisement -

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన సినిమా ‘మిస్సింగ్‌ మేఘన’ రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల..’ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ, ‘ఈ సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్, మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్, సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు’ అని దర్శకుడు వాచస్పతి చెప్పారు.
నిర్మాత నరేష్ మాట్లాడుతూ, ‘రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సినిమా సైతం అన్ని వర్గాల ప్రేక్ష‍కుల్ని అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఓ మంచి సినిమాని నిర్మించినందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -